CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యురాలు

Share it:

 


*పసర పోలీసుల ఆధ్వర్యంలో లొంగు బాటు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏఎస్పీ కార్యాలయంలో ములుగు ఏఎస్పి సాయి చైతన్య మాట్లాడుతూ మడకం హిడి మె గుత్తి కోయ గ్రామం టేట్టం, మండలం కట్టే కళ్యాణ్, దంతేవాడ జిల్లా, చత్తీస్ఘడ్ రాష్ట్రం కు చెందిన ఈమె ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తో గు గూడెం గ్రామంలో ఉంటూ 2015 సంవత్సరంలో దుమ్ముగూడెం మండలం దళం పాటలకు, సంస్కృతి కార్యక్రమాలకు ఉపన్యాసాలకు ఆకర్షితులై దళ కమాండర్ కోవాసి దేవా ఆదేశాల మేరకు అజ్ఞాతవాసం లోకి వెళ్ళింది, అని బడుగు బలహీనవర్గాలకు సేవ చేయాలనే సంకల్పంతో మావోయిస్టు పార్టీ సభ్యులుగా కొనసాగుతూ మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఆదేశాల మేరకు పని చేస్తూ అగ్రనేతల నమ్మకమైన దళ సభ్యురాలిగా పని చేస్తుండగా పార్టీ విధానాలు నచ్చక పార్టీ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడి పార్టీలో పని చేయలేక లొంగి పోదామని అగ్రనేతలకు చెప్పగా వారు బలవంతంగా పార్టీలు కొనసాగాలని ఆదేశించారని అన్నారు. వెళ్లకుంటే ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చంపుతున్నారని మావోయిస్టు పార్టీ తీవ్రమైన చర్యలు వల్ల చాలామంది మావోయిస్టు పార్టీని వదిలి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూలి పని చేసుకొని బ్రతుకుతున్నారు, అని దళ సభ్యులకు కనీస స్వేచ్ఛను హక్కులను హరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న మావోయిస్టు పార్టీని వీడి చతిస్గడ్ అడవుల్లో నుండి బయటకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గూడెం గ్రామంలో తన బంధువుల సహాయంతో ములుగు జిల్లా పసర ఎస్ ఐ రవీందర్ ఆధ్వర్యంలో ములుగు ఏఎస్పీ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన హీడిమే కు తక్షణ సహాయం కింద 5000 అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ శిక్షణ ఎస్సై మౌనిక రెడ్డి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: