CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులు రైతు బంధు నిధులు సమీపంలోని పోస్టాఫీసుల్లో తీసుకోనే అవకాశం

Share it:

 


మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం:

రైతులు రైతు  బంరైతులు రైతు  బంధు నిధులు సమీపంలోని పోస్టాఫీసుల్లో తీసుకోవడానికి అవకాశంధు నిధులు సమీపంలోని పోస్టాఫీసుల్లో తీసుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.   కరోనా నేపద్యంలో రైతులు బ్యాంకు వెళ్లి నగదు తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని పోస్ట్ ఆఫీసుల్లో నగదు తీసుకోవచ్చునని ఆయన తెలిపారు.  నగదు తీసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఈ సేవలు పూర్తిగా ఉచితమని చెప్పారు. 

అదనపు ఖర్చు లేకుండా వారి గ్రామాలలో వారి సంబంధిత బ్యాంకు ఖాతాలు  పోస్టల్ ద్వారా తీసుకోవడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. పోస్ట్ ఆఫీసుల్లో  రూ .169 కోట్లు ఉపసంహరణకు పోస్టల్ శాఖ ముందుకొచ్చిందని రైతులు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోడంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించారని, ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.  రైతులకు నగదు చెల్లింపుల కోసం రాష్ట్రంలోని 5794 పోస్టాఫీసులలో మైక్రో ఎటిఎం సేవలను ఏర్పాటు చేశారని చెప్పారు. గ్రామ పోస్టాఫీసుల నుండి నగదు తీసుకోవడానికి  ఏదైనా బ్యాంకుకు ఆధార్ లింక్డ్ ఖాతాలను కలిగి ఉన్న రైతులు మైక్రో ఎటిఎం సేవలను పొందవచ్చు.

 ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో రైతు బంధు డబ్బును ఉపసంహరించుకోవటానికి బ్యాంక్ బ్రాంచులు,  ఎటిఎం సేవలను వినియోగించుకోలేని   రైతులకు మైక్రో ఎటిఎం సౌకర్యం చాలా ఉపయోగ

పడుతుందని ఆయన చెప్పారు.

మైక్రో ఎటిఎమ్‌ను ఉపయోగించడం కోసం, రైతు తన  ఆధార్ కార్డ్ మరియు మొబైల్‌తో సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లాలని ఏదైనా బ్యాంక్ ఖాతాతో అనుసంధానించబడి, వేలి ముద్రను వేయడం  ద్వారా నగదును ఉపసంహరించు

కోవదానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. రైతు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ కు వచ్చిన  ఓటిపి  పోస్ట్ మాస్టర్‌కు తెలియచేయాలని ఆయన చెప్పారు.

మైక్రో ఏటీఎంల ద్వారా గరిష్టంగా  10 వేల రూపాయలు తీసుకో వడానికి అవకాశం ఉందని చెప్పారు. 

మైక్రో ఎటిఎం సేవలు పూర్తిగా  ఉచితమని రైతులందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని కాబట్టి రైతులు ఈ సౌలబ్యాన్ని వినియోగించు

కోవాలని చెప్పారు. 

మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో

రైతులు రైతు బంధు నిధులు తీసుకోవడానికి పోస్టల్ మైక్రో ఎటిఎంను సమర్థవంతంగా ఉపయోగించు

కోవడానికి వ్యవసాయ అధికారరులు, రైతు బంధు సభ్యులతో పాటు  ఇతర క్షేత్ర సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: