CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి ప్రాంత పలు సమస్యలపై ఐటీడీఏ పీవో కు వినతి పత్రం ఇచ్చిన తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

 ఏటూరు నాగారం ఐటిడిఎ కార్యాలయంలో మంగళవారం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం ఐటిడిఎ పరిధిలోని ఆదివాసి ప్రాంత పలు సమస్యలపై ప్రాజెక్ట్ అధికారితో చర్చించి వినతిపత్రం ఇచ్చిన అనంతరం రాష్ట్ర తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ

2021 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజల సాగు తాగు నీరు అందించాలనే లక్ష్యం తో పూర్తి కావస్తున్నా  శ్రీ సమ్మక తుపాకుల గూడెం  ప్రాజెక్టు వలన ములుగు జిల్లా పరిధిలోని సమ్మక్క వారసులైన కోయ జాతి ప్రజలకు ఒక ఎకరానికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ అందే పరిస్థితి లేదని అన్నారు. ఎక్కడో ఉన్న రంగారెడ్డి, నిజామాబాదు, కరీంనగర్ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మైదాన ప్రాంతాలకు 7,50,000 ఎకరాలకు నీరు గోదావరి నుండి  తరలించ బడుతుంది అని అన్నారు. 8 లక్షల మందికి తాగు నీరు అందించబడుతుంది అని అన్నారు ఇది ముమ్మాటికీ నీటి దోపిడీ అని ఆదివాసి ప్రజలకు అన్య్యాయం చేయటం అవుతుంది అని వివరించారు.దేవాదుల ప్రాజెక్టు నుండి 6,21,000 నీరు 2004 నుండే మైదన ప్రాంతాలకు పైపు లైన్ల ద్వారా తరలి పోయాయి అని మళ్లీ ఇపుడు కూడా అదే అన్యాయం జరుగుతుంది అని అన్నారు. ఆదివాసీల భూములు పూర్తిగా వర్ష దార పంట భూములు అని అందుకే ఆదివాసి రైతుల వ్యవసాయ అభివృద్ధికి నీరు ఏజెన్సీ మండ లలకు అందించాలి అని కోరారు. వెంటనే ఇరిగేషన్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కు నివేదిక పంపుతానని పీవో హామీ ఇచ్చారు. అదే విధంగా ఎండాకాలం వస్తె ఆదివాసీల నీరు త్రాగు నీరు దొరకక కిలోమీటర్ ల మేర నడిచి చెలిమలలో బురద నీరు తాగి బతుకుతారు అని పీవో కి వివరించారు. అందుకే ప్రభుత్వం కి ఆదివాసీల బాధలు రిపోర్టు రాసి పంపాలని విన్నవించామని అన్నారు. 

అదే విధంగా తుపాకుల గూడెం బ్యారేజ్ లో ఇంకా కొంత మంది రైతులకు బాక్ వాటర్ వలన ముంపుకు గురి అయ్యే వారికి రిహాబిటేషన్ ఇవ్వలి అనటంతో సర్వే చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. 

2016 లో జరిగిన పీసా గ్రామ సభ ప్రకారం నిర్వాసితులు అయిన స్థానిక ఆదివాసీలకు ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు,చేపలు పట్టుకునే హక్కు లాంటివి విషయం లో ప్రభుత్వం తో మాట్లాడి గ్రామ సభ తీర్మానాలు అమలు చేయనున్నట్లు పీవో తెలిపారు.

ఐలాపూర్ గ్రామం రోడ్డు సమస్య, ప్రధాన సమస్యగా, వ్యవసాయానికి అడ్డంకిగా ఉన్న త్రి ఫేస్ కరెంటు సమస్యపై కూడా ప్రత్యేకంగా అధికారులతో అక్కడి ప్రజలకు త్వరగా అందేలా కృషి చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు, పర్యావరణ శాఖ న్యుడిల్లి వారికి కూడా నివేదిక పంపినట్లు తెలిపారు. తప్పని సరి పరిస్థితులలో కరెంట్ అందిస్తాం అని తెలిపారు.

అనంతరం ఆదివాసి ప్రాంతం లో కరోనా విజృంభన పై కూడా ఆదివాసి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో తీసుకొనే జాగ్రత్తల గురించి కూడా పివో  తెలియజేశారు. ఆదివాసి ప్రజలకు నిత్యం అండగా ఉంటూ రక్షించుకోవాల్సిన బాధ్యత కరోనా బాధితులను దైర్యం చెప్పాల్సిన భాధ్యత కూడా ఆదివాసీ సంఘాల పై ఉన్నదని సంఘాలకు సూచించారు. చిన్న వయసులో కరోనా బారిన పడి ఆదివాసి యువకులు మరణించడం బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం సర్పంచ్ ఈసం, రామ్మూర్తి, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నీ బేల్లి గణేష్, జిల్లా అధ్యక్షులు దబ్బ కట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: