👉భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పో ట్రూ
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
భద్రాచలం ఐటీడీఏ ద్వారా ట్రైకార్ ఆర్థిక స్వాలంబన పథకం కింద రూరల్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా గిరిజన లబ్ధిదారులకు గూడ్స్ ట్రాలీ వాహనాలు మంజూరు చేయటం వల్ల తద్వారా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పో ట్రూ అన్నారు .
గురువారం రోజున భద్రాచలం ఐటీడీఏ నుంచి పి ఓ టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాల బ్యాంక్ మేనేజర్ ల తో రూరల్ ట్రాన్స్పోర్ట్ కింద గిరిజన లబ్ధిదారులకు మంజూరు చేసే గూడ్స్ ట్రాలీ వాహనాలు విధివిధానాలపై పథకం మంజూరు పై బ్యాంకు మేనేజర్ లకు పలు సూచనలు సలహాలు అందించారు
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పీవో మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన లబ్ధిదారులకు ఆర్థిక స్వావలంబన పథకాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు అధికారులు
విశేష కృషి చేస్తున్నారని రూరల్ ట్రాన్స్పోర్ట్ కింద మంజూరు చేసే వాహనాలకు సబ్సిడీ వచ్చినదని సంబంధిత బ్యాంకు మేనేజర్లు ఈ యూనిట్లు మంజూరు చేయడంలో శక్తివంచన లేకుండా పని చేయాలని సకాలంలో పథకం గిరిజన లబ్దిదారులకు అందినట్లు అయితే వారికి మేలు చేసిన వారు అవుతామని పి ఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ వో సురేష్ బాబు ,సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .
Post A Comment: