CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న స్పెషల్ కాంపెన్సేటరీ

Share it:

 


నిధులతో జిల్లాలో 1167 పనులు చేపట్టి 1147 పనులు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మన్యం టీవీ కొత్తగూడెం:-

గురువారం డిల్లీ నుండి

మినిస్ట్రీ ఆఫ్ హం అఫైర్స్ అల్కా శర్మ తీవ్రవాద ప్రభావిత జిల్లాల కలెక్టర్లుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ అనుదీప్

మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గిరిపుత్రులు అటవీ ఉత్పత్తుల సేకరణకు

సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు శాతం ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్మాణాలు చేపట్టినట్లు

చెప్పారు. ఇరిగేషన్, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. కమ్యూనిటీ హాళ్లు,

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు, రోడ్లు కల్వర్టులతో పాటు డిఆర్డిఓ, ఐటిడిఏ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి

అవకాశాలు కల్పించి జీవనోపాధులు కల్పనకు వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుత్తికోయల ఆవాసాలకు

సోలార్ పంపుసెట్లు మంజూరు ద్వారా సురక్షిత మంచినీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. 2017-18

ఆర్ధిక సంవత్సరంలో 5 కోట్లతో చేపట్టిన 31 పనులు పూర్తి చేశామని, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 33.34 కోట్లతో చేపట్టిన

277 పనులు కూడా పూర్తి చేశామని, 2019-2020లో 33.33 కోట్లతో చేపట్టిన 739య పనులు కూడా పూర్తి చేశామని,

2020-2021 ఆర్ధిక సంవత్సరాని 14.25 కోట్లతో 20 పనులు చేపట్టాల్సి ఉన్నదని ఆయన వివరించారు. ఈ నిధులు ద్వారా

గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ, భద్రాచలం ద్వారా చేపట్టిన 479 పనులు చేపట్టగా 471 పనులు పూర్తి చేశామని,

రోడ్లు భవనాలు శాఖ, భద్రాచలం ద్వారా 9 మంజూరు పనులు మంజూరు కాగా 8 పనులు పూర్తి చేశామని ఒక పని ప్రగతిలో

ఉన్నట్లు చెప్పారు. ఈఈ, ఇరిగేషన్ బ్రాంచ్ పాల్వంచ ద్వారా 151 పనులు చేపట్టి పూర్తి చేశామని, ఈ ఈ ఈడబ్ల్యుఇడిసి, ఖమ్మం

ద్వారా 44 పనులు, ఈఈ సర్వశిక్షా అభియాన్, ఖమ్మం ద్వారా 44 పనులు, ఐటిడిఏ పీఓ, భద్రాచలం ద్వారా 19 పనులు,

డిఆర్డీఓ, కొత్తగూడెం ద్వారా 128 పనులు చేపట్టగా 126 పనులు పూర్తి చేశామని, పంచాయతీరాజ్ ఈఈ కొత్తగూడెం ద్వారా 27

పనులు చేపట్టగా 20 పనులు పూర్తి చేశామని, పశుసంవర్ధక శాఖ ద్వారా 229 పనులు, వైద్యశాఖ ద్వారా 30 పనులు చేపట్టగా 29

పనులు పూర్తి చేశామని, ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా 3 పనులు చేపట్టి పూర్తి చేశామని, పోలీస్ శాఖ ద్వారా మూడు పనులు చేపట్టగా

ఒక పని పురోగతిలో ఉన్నదని మొత్తంగా జిల్లాలో ఎస్ సిఓ నిధులు ద్వారా చేపట్టిన 1167 పనుల్లో 1147 పూర్తి చేశామని 20

పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. జిల్లాకు 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు

మంజూరు చేయబడిన ఎస్ సిఓ నిధులు 85.92 కోట్లు మంజూరు కాగా 71,67 కోట్లతో చేపట్టిన పనులు నూరు శాతం పూర్తి

చేశామని 2021-21 ఆర్ధిక సంవత్సరానికి మంజూరు చేసిన 14.25 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉన్నదని ఈ నిధులతో చేపట్టనున్న

పనులకు సంబంధించి శాఖలకు కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసి ఫోటోలతో సహా ద్రవ్య

వినిమయ ధృవీకరణ పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు

చేస్తున్న ఎస్ సీఏ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మినిస్ట్రీ ఆఫ్ హం అఫైర్స్ అల్కా శర్మ హర్షం వ్యక్తం

చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీ సునీల్ దత్, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: