మన్యం టీవీ మంగపేట.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన మండలానికి చెందిన జర్నలిస్టు జానపట్ల జయరాజ్ కుటుంబానికి టీయుడబ్ల్యూజే(143) ఎలక్ట్రానిక్ మీడియా (టెమ్జూ)ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పలపెళ్ళి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇప్పలపెళ్లి రమేష్ మాట్లాడుతూ కరోనా టైంలో విధులు నిర్వహించే జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చని వారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మనోధైర్యంగా ఉండాలన్నారు. జర్నలిస్టు జయరాజ్ కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు తో పాటు మెడికల్ కిట్ అందచేశారు.
Post A Comment: