CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప‌ల్లెప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేయాలి.

Share it:

 


👉ప‌ల్లె, పట్టణ ప్ర‌గ‌తి కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిపిఓ, మున్సిపల్ కమిషనర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్. 👉సమావేశ వివరాలు తెలిపిన జిల్లా కలెక్టర్ అనుదీప్   

మన్యం టీవీ కొత్తగూడెం :-

రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వహిస్తున్న ప‌ల్లె, పట్టణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలను సద్వినియోగం చేసుకుని గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛతను సాదించేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం విజ‌యవంతం కావడానికి ఈ నెల 13వ తేదీన అదనపు కలెక్టర్లు, డిపివోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయడంతో పాటు భాద్యతలు, శక్తుల గురించి వివరించటం జరిగింది.

పల్లెప్రగతి ప్రారంభం అయి సుమారు ఏడాదిన్న‌ర‌ కావస్తోంది. ఇప్పటివరకు కష్టపడి చక్కని ఫలితాలు సాధించారు.

అదే స్పూర్తితో మ‌రింత క‌ష్ట‌ప‌డి ఈ సారి ప‌ల్లెప్ర‌గ‌తిని విజ‌య‌వంతం చేయాలి. గ్రామాల్లో ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత ఈ రెండింటి మీదే దృష్టి సారించాలి.

ప్ర‌భుత్వం జరిపించిన సర్వే లో చాలా జిల్లాలు 40 మార్కులకు గాను 23, 24 మార్కులు వస్తున్నాయి.

బ్రతికిన మొక్కల శాతం చాలా జిల్లాలో 85 శాతం కన్నా పైనే ఉంది. 

మ‌రి కొన్ని జిల్లాల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. 

ముఖ్య‌మంత్రి ఆకస్మిక సందర్శనలు చేయ‌నున్నారు.. నిర్ల‌క్ష్యం వ‌హించేవారిపై చ‌ర్య‌లు త‌ప్పవు.

ప్రతీ గ్రామం లో నర్సరీ ఉందన్నపుడు సిఎం చాలా మెచ్చుకున్నారు.

ప్రతి నర్సరీ లో అన్ని రకాల మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు చనిపోయిన మొక్కల స్థానంలో పెద్ద మొక్క‌లు నాటేవిధంగా చూడాలి.

సి.యం పరిశీలనలో ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్ లో, పట్టణాల్లో, రోడ్ మధ్యలో, కూడళ్ళ‌లో చెట్లు ఉంటున్నాయి, కాని రోడ్ల‌కు ఇరువైపుల చెట్లు ఉండే విదంగా చూడాలి.

పరిశుభ్ర‌తలో భాగంగా చాలా చోట్ల చెత్త సేకరణ రోజు వారి జరగటం లేద‌ని తెలుస్తుంది. అందుకే మనకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఉన్నాక కూడా ఇంకా చెత్త చెదారం లిఫ్టింగ్ చేయక పోవడమనేది సీరియస్ అంశం.

ఇంకా కొన్ని జిల్లాల్లో వైకుంఠధామాలు పూర్తీ కాలేదు, అన్ని 15 రోజుల్లో పూర్తీ చేసి, విరివిగా మొక్క‌లు నాటాలి.

గ్రామ సభలకు యం.పి.ఓ లు, డి.పి.ఓ లు, అడిషనల్ కల్లెక్టర్స్ హాజ‌రు కావాలి. అలాగే గ్రామ అభివృద్ధి కి చేసిన ఖర్చుల వివరాలు గ్రామ సభ దృష్టికి తీసుకోనిరావాలి.

వానాకాలంలో వాడకం లేని బోర్ బావులు, పాడుబ‌డ్డ బావులు ఒక్కటి కూడా గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు, రేపటి వరకు అన్ని పూడ్చేటట్లు చూడాలి.

ఎక్కడైనా పెద్ద బావులు ఉంటే దానికి అవసరమైన శిథిలాలు లిఫ్ట్ చేసుకోవడానికి మెటీరియల్ కాంపోనెంట్ కొంత ప్రొవిజన్ ఇవ్వాలని ఇప్పటికే సెక్రటరీ, కమీషనర్ కి చెప్పడం జరిగింది.

కరెంటు బిల్లులు, ఇతర బిల్స్ బకాయి లేకుండా చూసుకోవాలి.

చాలా జిల్లాల్లో గ్ర్రీన్ బడ్జెట్ పూర్తిగా వాడటం లేదని గమనించడం జరిగింది, కాబట్టి అవసరమైన చోట గ్రీనరీ కోసం ఈ బడ్జెట్ వాడుకోవాలి, ముఖ్యంగా పల్లె ప్రకృతి వనాలు కి అవసరమైన మొక్కలు సమకూర్చుకోవాలి.

అడిషనల్ కల్లెక్టర్ల‌కు వాహనాలు స‌మ‌కూర్చి, బ‌డ్జెట్ కేటాయించ‌టం జరిగింది. దీని ఫలితం కొంచమైన కనపడాలి. ఎక్కువగా గ్రామాల‌ను సంద‌ర్శించాలి.

జిల్లాలు చాలా చిన్నగా అయ్యాయి, కాబట్టి మీకున్న 15, 20 మండలాల్లో తప్పనిసరిగా నెలలో కొన్ని రోజులు ప‌ల్లె నిద్ర చేయాలి, ఉదయాన్నే గ్రామంలో పరిశుభ్ర‌త, ప‌చ్ర‌ధ‌నం మొదలైన విషయాలు గమనించి అక్కడికక్కడే సమస్యలు ప‌రిష్క‌రించాలి. తిరిగి 11 గంటల వరకు మీ మీ ఆఫీసు పని చూసుకోవాలి, గ్రామస్థులలో నమ్మకం, భాద్యతను కలిగించాలి.

చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, కమీషనర్ ఆకస్మిక పర్యటన చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండి యంత్రాంగాన్ని అప్రమ‌త్తం చేసి తగిన చర్యలు సూచించాలి.

సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, యం.పి.ఓ ల పై ఫిర్యాదులు ఉంటే షోకాజ్ నోటిసులు జారీ చేసి 15 రోజులలో చర్యలు తీసుకోవాలి.

వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మొక్కలు నాటడం ప్రారంభించాలి. 

చాలా జిల్లాల్లో ప్రారంభించినట్టు రిపోర్టులు వస్తున్నాయి, వారంద‌రికి అభినందనలు.

చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలు నాటాలి.

ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా అరిక‌ట్ట‌గ‌లిగాం.

వానాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకొని క్లోరినేషను మరియు పరిసరాల పరిశుభ్ర‌తకు తగు చర్యలు తీసుకోవాలి. అడిషనల్ కల్లెక్టర్లు, డి.యం & హెచ్.ఓ లు, డి.పి.ఓ లు సమన్వయ సమావేశాలు నిరవీక్హించి సన్నద్ధంగా ఉండాలి.

అంద‌రి కృషితో ఇప్ప‌టి వ‌ర‌కు పంచాయ‌తీరాజ్ శాఖ‌కు అవార్డులు, అభినంధ‌న‌లు వచ్చాయి. ఇదే స్పూర్తితో మెరుగైన ఫ‌లితాలు తీసుకురావాలని ఆశిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో అటవీ అధికారి రంజిత్, డీపీఓ రమాకాంత్, మున్సిపల్ 

కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: