CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత జాతి ఎప్పటికి మర్చిపోదని

Share it:

 


దళిత సాధికారత పథకం పై హర్షం,వ్యక్తం చేసిన ములుగు జిల్లా మాలమహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు




మన్యం టీవీమంగపేట :


 అడగకుండా వరాలు ఇచ్చేది దేవుడు కానీ ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి దళిత సాధికారత కోసం 1200 కోట్లు కేటాయించడం నిజంగా ఇది దళితజాతికి ఇది శుభపరిణామం అని ఈ సందర్బంగా ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు పేర్కొన్నారు.

దళిత సాధికారత పథకానికి రూ: 1200 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత సాధికారత పథకానికి నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, దళితులు అణచివేతకు గురవుతున్న సమయంలో అఖిలపక్ష పార్టీల సహకారంతో సమావేశం నిర్వహించి,దళిత సాధికారత కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు,సంఘాల నాయకులు,ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.సీఎం కేసీఆర్ దళితులకు చేస్తున్న సహాయాన్ని జాతి ఎన్నటికీ మరచిపోదని ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు గుర్తు చేసుకున్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో సాకారం అయిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో  ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు యువజన నాయకులు,దళిత సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: