మన్యం మనుగడ, మణుగూరు:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణుగూరు గ్రౌండ్ లో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ యోగ తోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని దానిద్వారా కరోనా లాంటి భయంకరమైన వ్యాధులను కూడా ఎదుర్కొనే శక్తి
కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ చేసి దైనందిక జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో లో వ్యాయామ ఉపాధ్యాయులు పోలే బోయిన అనిల్ కుమార్, వీరన్న ,ఉపాధ్యాయులు రామ్ చందర్, బద్రు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: