మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిదిలోని వేదాంత పురం, వినాయకపురం, జమ్మి గూడెం, మద్దికొండ, కేశప్పగుడెం మొదలైన గ్రామ పంచాయతీలలో కరోనా వచ్చి హోం ఐసోలేషన్ లో వున్న కుటుంబాలకు మరియు పంచాయితీ పారిశుధ్య కార్మికులకు, ఆశ వర్కర్లకి నిత్యావసర సరుకులు అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా ఆదేశానుసారం పేపర్ బోర్డ్ వారి సౌజన్యంతో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ కరోనా వచ్ఛిన వారికి ధైర్యం చెప్పి ఈ కరోనా మహమ్మారి త్వరగా పోవాలని అందరు సంతోషంగా వుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, సర్పంచులు, బాబురావు, భవానీ, జోష్నా బాయ్, ఉప సర్పంచ్ శ్రీకాళహస్తి, ఎంపీటీసీలు రామకృష్ణ, మారుతి లలిత, కాసాని దుర్గ, నియోజక వర్గ నాయకులు మోహన్ రెడ్డి, ఆకుల శ్రీను, కృష్ణా, బ్రహ్మం ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీ లు, ఆశ వర్కర్లు, పంచాయితీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: