👉ఏ ఎస్ పి డాక్టర్ .వినీత్ ఐపీఎస్.
మన్యం మనగడ ,భద్రాచలం టౌన్:
జే.డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరువాక పున్నమి పురస్కరించుకుని రైతులకు ఘన సన్మానం.
రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయం అనే లక్ష్యంతో దేశానికి వెన్నెముక అయిన రైతుని పూజించే గొప్ప నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన జెడి ఫౌండేషన్ ని అందించారు భద్రాచలం ఎ.ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ,భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్ లో గల ఒక కౌలు రైతు పొలం నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌలు రైతులకు సన్మానం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వినీత్. ఏరువాక పౌర్ణిమ రోజున కౌలు రైతులను, చిన్న ,పేద రైతులను ,దుక్కి దున్నే ఎడ్లను పూజించి వారిని సాంప్రదాయబద్ధంగా సన్మానించడం. గురువును పూజించినట్లే,అన్నదాత అయిన రైతులు కూడా రైతు పూజోత్సవం పేరుతో పూజించటం. నిజంగా సంతోషం కలిగించింది అని తెలిపారు. ఈ మేరకు భద్రాచలం, పురుషోత్తపట్నం, నెల్లిపాక,కొల్లు గూడెం మరియు ఏళ్ల బయ్యారంలో ని ఎంపిక చేసిన 9 మంది కౌలు రైతులను(ఇద్దరు మహిళ రైతులకు) ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జెడి ఫౌండేషన్, భద్రాచలం బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 31 జిల్లాలోనిలో ఎంపిక చేసిన చిన్న సన్నకారు మరియు కౌలు రైతులను సన్మానిస్తున్న మని అని అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా ఈసారి పొలంలోనే రైతుల మధ్య సన్మానం నిర్వహించడం ఆనందకరంగా ఉందని అలాగే రైతులను సన్మానించడం లో ప్రత్యేకంగా వారికి ప్రశంసాపత్రాన్ని అందించడం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది అని మరొక అతిథి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ తెలిపారు.
"రైతుకు చేయూత" నూతన పధకం ప్రారంభం.
కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక అప్పుల పాలయ్యి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో ప్రప్రథమంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు చేయూత అనే పేరుతో ఎంపిక చేసిన 3 రైతులకు(శ్రీమతి అమరజ్యోతి, శ్రీమతి మణి, శ్రీ మద్దినేని వెంకటేశ్వర రావు)లకు 11 వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళాలను జెడి ఫౌండేషన్ సభ్యులతోపాటు ప్రవాస భారతీయులు శ్రీ ఆకునూరి రమణ రావు అందజేసినట్లు మురళి మోహన్ కుమార్ తెలిపారు ఈ విరాళాన్ని తిరిగి రైతు పంట పండించిన తర్వాత యధావిధిగా పౌండేషన్ అందజేస్తారని తెలిపారు. ఈ పధకం జే.డీ పౌండేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రధమంగా ప్రారంభించామని దీనిలోని లోటుపాట్లను, ఇతర సలహాలు సూచనలు పాటించి వచ్చే సంవత్సరం దీన్ని విరివిగా అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ పవన్ కుమార్ ,శ్రీ కడాలి నాగరాజు శ్రీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ యూసఫ్ మియా ,సన్మానం పొందిన రైతులు శ్రీ దారపునేని చెన్నయ్య, ఇంటూరి లింగయ్య,బురేం అప్పారావు, భాష్యం బుచ్చయ్య,చుంచు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: