CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

Share it:

 


కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

మన్యం టీవీ ఏటూరు నాగారం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి సూచన మేరకు 

ములుగు జిల్లా కేంద్రములోని పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యములో 

ముఖ్య అతిథులుగా హాజరైన కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ 

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ లు మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రములో ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల వలన ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన వలన ఈ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుమారు 45 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఈరోజు వంద రూపాయల

దాటుతుందని డీజిల్ కూడా సుమారు 100 శాతం పెరిగింది దీనివలన రవాణా ఛార్జీలు పెరగడం తో పాటు నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అని దీనివలన సామాన్య పేద ప్రజలు బ్రతక లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెంచిన జి ఎస్ టి వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా

విఫలమైందని, కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఉచితంగా అందించాలి అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాన్యాన్ని మద్దతు ధర తో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.అని అదేవిధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి మేము కేంద్ర ప్రభుత్వానికి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,కిసాన్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి,

జిల్లా నాయకులు కంబాలరవి,

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కులరేవంత్, యూత్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,

కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి గుంటోజూ శంకరయ్య,సర్పంచ్ రత్నం భద్రయ్య, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్,మాజీ ఉప సర్పంచ్ ఎల్లవుల అశోక్, గండ్రత్ విజయాకర్,

మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి తారక్, చంద్, మేడం రమణకర్,కర్నె రతన్, మహమ్మద్ ముక్కిన్,ఓంకార్

కొండ బోయిన దేవా రాజు,

గణేష్, రహుల్,లక్కీ అనీల్ కుమార్, మంకిడి పూర్ణ చందర్,జబ్బార్ ఖాన్

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: