మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామానికి చెందిన నూనె గంగరాజు కుమారుడు నరాల బలహీనత తో హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న వారిని బుధవారం రోజున పరామర్శించి, ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ తో మాట్లాడిన అశ్వరావుపేట తెరాస పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ సందర్భంగా జారే ఆ కుటుంబానికి తెరాస పార్టీ అన్ని విధాలుగా సహాయం చేకూరుస్తుందని భరోసా ఇచ్చి, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు.
Post A Comment: