CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మారుమూల గిరిజన గ్రామాలలో కరోనా బాధితులను పరామర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా.సీతారాములు....

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ :-

ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని బంగారుచెలక ,మైలారం,బొజ్జలగూడెం,తోకబందాల,చింతపెంటిగూడెం,లక్మిపురం,ఆర్లగండి గ్రామాలలోని కరోనా బాధితులను పరామర్శించి.. కూరగాయలు,నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది..

👉.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు మాట్లాడుతూ కరోనా కు సంబంధించిన జాగ్రత్తలను తెలియజేశారు

👉 అలాగే ప్రభుత్వం కరోనా నియంత్రణలోను,ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయిందని, అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కరోనా బాధితులకు వైద్యం సరిగా అందడం లేదన్నారు..

👉అలాగే కరోనా వ్యాక్సిన్ ముందుగా ఉపాధి కూలీలకు,చిరు వ్యాపారులకు ఆటో డ్రైవర్లకు ,ప్రైవేటు ఉపాధ్యాయులకు ,లెక్చరర్ లకు ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వానికి సూచించారు...

👉 అలాగే స్థానిక ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బాధితుల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు...

👉ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని

కరోనా రాపిడ్ టెస్టులను పెంచాలని,...కోరారు


👉వ్యవసాయ కూలీలకు భవన నిర్మాణ కార్మికులకు వ్యాక్సిన్ ముందుగా వేయాలని ప్రభుత్వానికి సూచించారు


👉కరోనా బాధిత కుటుంబాలకు నెలకు 5000 రూపాయల నగదును అందించాలన్నారు


👉అలాగే కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు..


👉కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయినా పిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకొని వారి పేరున10లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...

👉మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్యం ప్రభుత్వమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ షేక్.అబీద్ .జిల్లా కాంగ్రెస్ నాయకులు పాపిడబోయిన.పున్నం,బొబ్బాల. రమేష్ ,పూసం.సత్యనారాయణ, సరెం.రామారావు,మాడే.బాబురావు,జుత్తు.శ్రీనివాస్,కాట్రాల.సర్వయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, వీరు,అజ్జు,రాజు,బాలాజీ,సుమన్,

తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: