CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజల రక్షణ లో ముందుండేది పోలీస్

Share it:

 



 గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  ఎస్పీ సునీల్ దత్

నూతన భవనాలను ప్రారంభించిన ఎస్పి

 గుండాల  ( మన్యం టీవీ) ప్రజల రక్షణలో  ముందుండేది  పోలీసులే అని కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్  అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సందర్శించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మరియు పోలీసులు  విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన భవనాలను ప్రారంభించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం 17 లక్షలు విశ్రాంతి  గది కోసం 42 లక్షల రూపాయలు వెచ్చించి భవనాలను నిర్మించారు . అనంతరం ఎస్పి సునీల్ దత్ మాట్లాడుతూ ప్రజల రక్షణ లో ముందుండేది పోలీసులే అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులకు ఎవరు సహకరించవద్దని ఆయన కోరారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సందర్శిస్తే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డి తిరుపతి , ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి , గుండాల సీఐ శ్రీనివాస్ , గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ , కాచన పల్లి ఎస్ఐ  (కొమరారం) శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: