మన్యం మనుగడ, పినపాక:
ఏఐసీసీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం పినపాక మండలం బయ్యారం ఎక్స్ రోడ్ లోని పెట్రోల్ బంక్ నందు మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రజలపై పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోన కష్ట కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మంచి నూనె నిత్యవసర సరుకుల ధరలను పెంచి ప్రజలను నిట్టనిలువునా దోచుకుంటున్నాయి. పెరిగే ధరలను నియంత్రించి ప్రజానికాన్ని కాపాడాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రతీ రోజు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోడ రమేష్, మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీను, సీనియర్ నాయకులు గీద సాయి, కార్యవర్గ సభ్యులు పూనెం వెంకటేష్, తోకల సాంబయ్య, దునిగల తాతయ్య, బట్ట వెంకటేశ్వర్లు, నూప భద్రయ్య, కలం రమేష్, కోర్స రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: