మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామపంచాయతీ ఉమ్మాయి నగర్ గ్రామంలో ములుగు తెరాస పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు కుచాన రమేష్ రెడ్డి కి 60 వేలు,కుచాన సాంబయ్య కు 60 వేలు.సీఎం సహాయ నిధి చెక్కులను ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలు కార్పొరేట్ వైద్యంతో ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నావారికి అండగా సీఎం రిలీఫ్ ఫౌండ్ ఎంతోగానో ఉపయోగపడుతుందని అన్నారు.ములుగు జిల్లాలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ చొరవతో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా సీఎం సహాయనిధి చెక్కులు అందించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లంపల్లి సర్పంచ్ చందా కుమార స్వామి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, కుంచా సంపత్ పరికిపండ్ల సదానందం,గొర్రె కుమార్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: