👉40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేత
మన్యం మనుగడ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామంలో కరొనా వల్ల బాధపడుతున్న గ్రామస్తులకు హైదరాబాద్ కు చెందిన గురుపూజ్యులైన గోవిందరాజు (రిటైర్డ్ ఇంజినీర్) నిత్యావసర వస్తువులు అందజేశారు. బైర్రాజు ఆంజనేయులు మరియు వడ్లమూడి వెంకటరామరాజు ద్వారా కరొనా వచ్చినా 40 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, కొడిగుడ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారం రాజశేఖర్, ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, బేతి రాంబాబు, సంగం దుర్గారావు, మనుకొండ వేంకటేశ్వరావు, బేతి నర్సింరావు, మరియు మల్లాయిగూడెం గ్రామ యుత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరొనా బాధిత కుటుంబాలు గొవిందరాజు కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Post A Comment: