అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు గురించి సానుకూలంగా స్పందన
మన్యం మనుగడ , పినపాక:
పినపాక మండలం లోని జానంపేట గ్రామానికి చెందిన యువత అభయ్ దళిత్ సేవా సొసైటీ సంస్థ తరఫున తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు జానంపేట లో డా. బి. ఆర్. అంబెడ్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు తమ వంతు సాయంగా విగ్రహాన్ని కోరడం జరిగింది. దీనికి రేగా కాంతారావు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ కారణంగా గా అభయ్ దళిత్ సేవా సొసైటీ సభ్యులు ఎం ఎల్ ఏ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక పి ఏ సి యస్ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ, జానంపేట సర్పంచ్ బాడిష మహేష్, ఎంపి టి సి పొలిశెట్టి హరీష్, ఏ డి యస్ యస్ అధ్యక్షులు కుమ్మరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వరికిల్ల వీర్రాజు, సెక్రెటరీ రాంటెంకి బాబురావు, ట్రేసరర్ మదారి రాజు, యూత్ అధ్యక్షులు బందేల కన్నారావు, మరియు తదితరులు పాల్గొన్నారు....
Post A Comment: