మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలంలోని ఏవెన్యు ప్లాంటేషన్ కు వేసే మొక్కలను అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మేచ్చా నాగేశ్వరరావు మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తీ చేయాలని, ప్రజా క్షేమమే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ ఒక్క ఏవెన్వు ప్లాంటేషన్ కార్యక్రమంలో అశ్వరావు పేట మండలంలో మొత్తం సుమారు 92 కిలోమీటర్లు దూరం వేయాలని సుమారు కిలోమీటరు కి 400 మొక్కలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నాంసెట్టీ వరలక్ష్మీ, మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్,అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఏపీఓ శ్రీనివాస్, ఎంపిటిసిలు నాండ్రు భారతి వేముల భారతి, తిరుమల, టీఏ ప్రేమ్, నియోజక వర్గ నాయకులు మోహన్ రెడ్డి, జూపల్లి ప్రమోద్, తాడేపల్లి రవి, చిన్నంసెట్టి వెంకట నరసింహారావు, నండ్రు రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: