CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

###పుట్టుక వేరైనా..

Share it:


మమ్ములను కలిపింది సీపీఎం.. 

అందరం ఓకె కుటుంబమై అంత్యక్రియలు నిర్వహించిన హెల్ప్ లైన్ సభ్యులు....###


మన్యం టీవీ పాల్వంచ :- కుటుంబ సభ్యులు సమయానికి రాలేని పరిస్ఠితి... అంతా తామై పార్టీ శాఖ కార్యదర్శి రాధమ్మ కు అంతిమ వీడ్కోలు పలికిన నేతలు.


-- పాల్వంచ టౌన్ నవభారత్ ఏరియా సీపీఎం శాఖా కార్యదర్శి సీనియర్ కార్యకర్త కామ్రేడ్ రాధమ్మ కరోనా వ్యాధి తో ప్రభుత్వ ఆసుపత్రి కొత్తగూడెంలో (01/06/21) న మృతి చెందారు. కామ్రేడ్ రాధమ్మ భర్త నరసింహారావుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసు కున్న పాల్వంచ పార్టీ పట్టణ నాయకత్వం. పరామర్శ కు వెళ్ళిన నాయకత్వం. రాధమ్మ పరిస్థితి చూసి వెంటనే పర్సా, మంచికoటి హెల్ప్ లైన్ సెంటర్ బాధ్యులను సంప్రదించగా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. పరిస్థితి విషమించిన రాధమ్మ సా 3.45 నీ లకు మరణించారు. రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారులు ఒకరు మంచిర్యాల, ఇంకొకరు హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా ఉన్నారు. రాలేని స్థితి, బంధువర్గం వున్నప్పటికీ రాలేమని చెప్పారు. కుమార్తె లక్ష్మి, మనుమడు రామకృష్ణ వెంట ఉన్నారు కాని ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మా అమ్మ దహన సంస్కారాలు ఎవరైనా చేస్తే డబ్బులు ఇస్తామనీ కుమారులు చెప్పారు. మేమున్నం అంటూ వెంటనే అంబులెన్సు మాట్లాడి, ఖననం చేయడానికి ఏర్పాట్లు చేసి...

ఆ స్థితిలో మానవత్వాన్ని చాటే పద్దతిలో, అందరికి అందుబాటులో ఉండే విధంగా సీపీఎం ఏర్పాటు చేసిన కొత్తగుడెం పర్సా, మంచికoటి హెల్ప్ లైన్ సెంటర్ మరియు పాల్వంచ బరపటి హెల్ప్ లైన్ సెంటర్ బాధ్యులు అంత తామై.. దహన సంస్కారాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జాటోత్ కృష్ణ, భూక్యా రమేష్, దొడ్డ రవి, కొండబోయిన వెంకటేశ్వర్లు,మెరుగు ముత్తయ్య, గుడిపురి రాజు, కే. సత్య, వాణీ, వాంకుడోత్ రవి, సిద్దెల ఖాసిం, చంటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: