CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై మూడేళ్ల పాటు అనర్హతా వేటు

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

చట్టసభల ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై మూడేళ్ల పాటు అనర్హతా వేటుపడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన... నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో... ఈసీ అనర్హతా వేటు వేసింది.


కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హతా వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన... నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో... ఈసీ అనర్హతా వేటు వేసింది. మూడేళ్ల పాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభకు, శాసన మండలికి పోటీ చేసే అర్హతను.... బలరాం నాయక్ కోల్పోయినట్లు ఆదేశాలు జారీ చేసింది.


అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన.... బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిపై కూడా ఈసీ అనర్హతా వేటు వేసింది.

Share it:

Post A Comment: