CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"వనాలు-మానవాళి వరాలు"- ఎంపీపీ సున్నం లలిత

Share it:




మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, తెలంగాణకు హరితహారం ఏడో విడత కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు ఎంపిపి సున్నం లలిత. హరితహారం కార్యక్రమంలో పాల్గొని, మండలంలోని వెంకటాపురం గ్రామ రహదారుల వెంట మొక్కలు నాటారు. వారితో పాటు ఎంపీడీవో-జి రేవతి, తహసిల్దార్-కే భద్రకాళి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు, ఎంపిఓ-దారా విజయభారతి, అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్- బోడ పద్మ, ఉప సర్పంచ్- పర్సా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ సున్నం లలిత మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వగలమని. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరం నుండి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో మండల ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని రక్షించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి- ఎస్కె ఖాదర్ మియా, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్- జొన్నలగడ్డ రాము, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం కూలీలు, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: