CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవీయ కోణంలో పోడు సమస్యను చూడాలి.

Share it:

 ప్రకటనలకే పరిమితమైన ముఖ్యమంత్రి హామి.

 

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా


జిల్లా అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందించిన నేతలు

మన్యం టీవీ పాల్వంచ:-

పోడు భూములనే నమ్ముకొని అనాదిగా జీవనం సాగిస్తున్న గిరిజన,గిరిజనేతర పేదల పోడు వ్యవసాయం  సమస్యను అటవీశాఖ అధికారులు,రాష్ట్ర ప్రభుత్యం మానవీయకోణంలో చూడాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా పేర్కొన్నారు.జిల్లా వ్యాపితంగా పోడు సాగుదారులపై జరుగుతున్న దాడులు, భూముల స్వాదీనం చేసుకుంటున్న తీరు,పేదలు పడుతున్న ఇబ్బందులు అనేకం, ముఖ్యంగా గిరిజనులు  పోడు వ్యవసాయం తప్ప మరొక్క ఆలోచన ఉండదు,ఈ పోడు వ్యవసాయమే వీళ్ళ  ప్రధాన వృత్తి,ఈ పోడు వ్యవసాయం లేకపోతే,వీళ్ళకు జీవనాధారం లేదు,గిరిజనులకు పోడు వ్యవసాయం మీద సర్వ హక్కులు ఉన్నా,ప్రభుత్వలా లోపాల వల్ల గిరిజనులకు న్యాయం జరగడం లేదు అని,   సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి దృష్టికి తీసుకెల్లారు. పోడు సమస్యపై అధికారికి వినతీపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సాబీర్‌ పాషా మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఆదేశాలతో అటవీ, పోలీసు శాఖలు దాడులు ముమ్మరం చేసి పేద రైతులను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం అనాదిగా పోడు వ్యవసాయం  సాగుచేసుకుంటున్న తమకు హక్కు పత్రాలు జారీ చేయాలేదని  మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా దాడులకు పూనుకుంటోందన్నారు.పోడు సమస్య పరిష్కరిస్తామని, పోడు భూముల్లో కుర్చీవేసుకొని కూర్చొని హక్కు పత్రాలు జారీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ అటకెక్కిందని విమర్శించారు.పేదలు తమ బ్రతుకు దెరువుకోసం పోడు భూములను సాగుచేసుకొని పొట్టపోసుకుంటున్నారే తప్ప వేలాది ఎకరాలు అక్రమించుకోలేదని పేదలు వ్యవసాయం చేస్తున్నారేగాని వాతావరణాన్ని కలుషితం చేయడం లేదని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అడవులనే నమ్ముకొని జీవిస్తున్న పేదలకు బువ్వలేకుండా చేస్తామంటే చూస్తూ ఊరుకోరని, ఎలాంటి నిర్భందాలకైనా వెనుకాడకుండా భూములు రక్షించుకుంటారన్నారు.అటవీ, పోలీసు శాఖల కవ్వింపు చర్యలకు పోడు రైతులు ఎదురొడ్డి నిలవాలని, ప్రతిఘటనోద్యమాలతో తమ భూములు కాపాడుకోవాలని అందుకు సిపిఐ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. డిఎఫ్‌వోను కలిసిన ప్రతినిధిబృందంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాస్‌,భూర్గంపాడు మండల నాయకులు మువ్వా వెంకటేశ్వర్‌రావు, ఎండి.సాజీద్‌,గుగులోత్‌ భీమా, వంకాయలపాటి నాగేశ్వర్‌రావు,భద్య, నంధ్య, శంకర్‌, లక్ష్మ ణ్, మధు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: