మన్యం మనుగడ ,కరకగూడెం:
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన కరకగూడెం మండలంలో చోటు చేసుకుంది . కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...గడ్డం గురవయ్య ఇల్లందు మండలం బుజ్జాయి గూడెం తన అత్తగారు బయటి వంటలకు వెళుతుండగా హాజరయ్యారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతుండగా తాటి గూడెం గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న ఎడ్ల బండిని తన ద్విచక్ర వాహనం తో ఢీ కొట్టాడు. ఆ ఘటనలో రెండు కాళ్లు కు తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో భద్రాచలం తీసుకువెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండగా భద్రాచలం నుంచి వరంగల్ రిఫర్ చేశారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రి వారు వైద్యానికి నిరాకరించారు. దానితో వరంగల్ ఎంజీఎం కి తరలించారు.
Post A Comment: