లేనిపక్షంలో డి ఎఫ్ ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం
గుండాల జూన్ 25 (మన్యం టీవీ) తుని కాకుల పైసలు ఫారెస్ట్ అధికారులు తక్షణమే తునికాకు కార్మికులకు చెల్లించాలని గుండాల ఎంపీటీసీ సంధాని డిమాండ్ చేశారు. తుని కాకులు సేకరణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఫారెస్ట్ అధికారులు డబ్బులు చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు తక్షణమే డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కొత్తగూడెం డివిజనల్ ఆఫీస్ ముందు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎండ ఎండనక వాననక అడవి జంతువుల బారిన పడుతూ తుని కాకులు సేకరిస్తే వాటి డబ్బులు చెల్లించడంలో ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తునికాకు కార్మికులకు పైసలు చెల్లించాలని డిమాండ్ చేశారు
Post A Comment: