CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు ఏరియా హాస్పటల్ లో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారభించడం సంతోషకరం ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*ములుగు జిల్లా కేంద్రములో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి.

*వెనుకబడిన ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారని ఆశించాం.

*కరోనా ను, బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ చేర్చి ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చెయ్యండి.

*ప్రతి పేద వాడికి  కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి.

*ముఖ్య మంత్రి గారు ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి.

*గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారం భించాలి.

*ములుగు నియోజకవర్గం లో ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి మద్దతు ధర చెల్లించాలి.

*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

*మన్యం టీవీ ఏటూరు నాగారం*

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఏరియా హాస్పటల్ లో డయాగ్నొస్టిక్ సెంటర్ ను మంజూరు చేసిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా పర్యాటక ప్రాంతం అయినా రామప్ప,లక్నవరం, శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, బొగత జలపాతం అనేక పర్యాటక కేంద్రాలు  మరియు  జాతీయ రహదారి ఉన్న నేపధ్యంలో వెనుక బాటుకు గురైన ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు చేయకపోవడం బాధాకరం అని కనీసం నర్సింగ్ కళాశాల మంజురుకైన కృషి చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కరోనా కష్ట కాలంలో పేద ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ముఖ్య మంత్రి గారు కరోనా ను ఆరోగ్య శ్రీ చేర్చాలని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండు చేశారు. 

ములుగు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో  ధాన్యం కొనుగోలు జరగక వర్షాలకు పంటలు చేతికి వచ్చినట్లే వచ్చి ధాన్యం తడిచి ముద్దైంది అని యుద్ద ప్రాతిపదికన అధికారులు తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని  అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,

మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య

మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,జిల్లా నాయకులు బండారి హరినాధం,పల్లె జయ పాల్ రెడ్డి,చింత నిప్పుల భిక్ష పతి,గందే శ్రీను,పాలడుగు వెంకట కృష్ణ,ములుగు ఉప సర్పంచ్ వంగ రవియాదవ్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్, జంపాల శేఖర్ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, కర్నె రతన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: