CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మా భూముల జోలికి రావొద్దు సారూ

Share it:

 


మన్యం టీవీ, గుండాల:

   👉  కోర్టు ఉత్తర్వులను చూపించిన వినకపోతే  కోర్టు ధిక్కార కేసు వేస్తాం

  👉 తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ మై పతి అరుణ్ కుమార్

గుండాల  భూముల జోలికి రావద్దు  సారు అంటూ మామ కన్ను గిరిజనులు  ఫారెస్ట్ అధికారులను  వేడుకుంటున్నారు. కోర్టు ఉత్తర్వులను చూపించిన  ఫారెస్ట్ అధికారులు  ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మామ కన్ను గ్రామంలో  తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్   మై పతి అరుణ్ కుమార్ తో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశానికి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి  కోడేం వెంకటేశ్వర్లు, హైకోర్టు అడ్వకేట్ అరెం పాపారావు హాజరయ్యారు.  అనంతరం అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను చూపించిన వినకపోతే హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు వేస్తామని ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. మామ కన్ను  గ్రామస్తులు 32 వా కంపార్ట్మెంట్లో ఆదివాసీలు గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వాటికి పట్టాలు కూడా మంజూరయ్యాయని అన్నారు. గతంలో ఐటిడిఎ ఐ టి డి ఎ, రెవిన్యూ , ఫారెస్ట్ అధికారులు సర్వే చేసి  పట్టాలను మంజూరు చేశారన్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు వినకుండా కందకాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ ని బాధ్యులను చేస్తూ పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చిందన్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన పేర్కొన్నారు. గతంలోనే ఈ భూముల విషయంలో గ్రామసభ నిర్వహించి ఆమోదం కూడా పొందామని ఆయన సూచించారు ఫారెస్ట్ అధికారులు  ఇప్పటికైనా స్పందించి కోర్టు ఆర్డర్లను పరిగణలోకి తీసుకొవాలని డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: