మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వీరబాబు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ.. వర్షాకాలం వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ సీజన్లో దోమల ద్వారా కలుషిత నీటి ద్వారా ఈగలు వాలిన పదార్థాలు తినడం ద్వారా రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ఈ మూడు అంశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం ద్వారా సమస్య నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. జూలూరుపాడు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. మండల ప్రజలందరూ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ చేయించుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ చేయించుకున్న ప్పటికీ కరోనా నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు. కరోనా థర్డ్ వే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న వాదనలు వాస్తవం కాదన్నారు. ఇప్పటివరకు కరోనా బారిన పడిన పిల్లలు ఎవరికి ప్రాణ హాని కాలేదన్నారు. కానీ ఇతర ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు నెలల వారీగా యేసే టీకాలు చేయించుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నారు. అందరూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారికి అన్ని వేళల వైద్య సేవలు అందించడానికి మేము మా సిబ్బంది ఉన్నామని తెలిపారు.
Post A Comment: