మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
✍️ప్రతి విద్యార్థికి కరోనా టీకాలు వేయాలి.
✍️టీకా ప్రక్రియ పూర్తయ్యాకే విద్యాసంస్థలను తెరవాలి.
✍️విద్యార్థులకు రక్షణ లేకుండా పాఠశాలలు ప్రారంభించడం వెనక ఆంతర్యం ఏమిటి?.
✍️విద్యాసంస్థలు తెరవడానికి మేము వ్యతిరేకం కాదు.. కానీ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు.
✍️విద్యార్థుల ప్రాణాలకు హాని జరిగితే ప్రగతి భవన్ ముట్టడిస్తాం--ఏఐఎస్ఎఫ్ భద్రాచలం పట్టణ కార్యదర్శి మారెడ్డి.గణేష్.
*భద్రాచలం//*: ప్రతి విద్యాసంస్థలో కోవిడ్ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టీకాలు వెయ్యాలిని ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి మారెడ్డి.గణేష్ డిమాండ్ చేశారు. మంగళవారం భద్రాచలం స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థలును పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కానీ విద్యార్థుల రక్షణను మరిచిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ విద్యార్థికి టీకా ప్రక్రియ పూర్తి కాకుండా విద్యాసంస్థలును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి కరోనా టీకాలు వేసి పూర్తిస్థాయిలో టీకా ప్రక్రియ పూర్తయిన తర్వాతనే విద్యా సంస్థలను తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రక్షణ లేకుండా విద్యా సంస్థలు తెరవటం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విద్యాసంస్థలు తెరవడానికి ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకం కాదు కానీ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు అవసరమైతే మరో పది రోజులు సమయం తీసుకోనైనా ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ టీకా ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, విద్యార్థుల ప్రాణాలకు హాని జరిగితే తమ సంఘం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాకు ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు తిరుపతి రావు,ప్రకాష్, శ్రీను కాశీనాధ్,కిషోర్. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: