CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆహారభద్రతా కార్డుల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవే

Share it:

 


👉ఫోర్‌ వీలర్‌ ఉంటే అనర్హులు

👉 మంగళవారం ప్రారంభమైన ఎంక్వయిరీ

మన్యం మనుగడ డెస్క్:

ఆహారభద్రతా కార్డుల జారీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో మంగళవారం నుంచి పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వారి వివరాలను వెరిఫై చేసేందుకు రెవెన్యూ, విద్యా, కో–ఆపరేటివ్, సివిల్‌ సప్లయ్‌ శాఖలకు చెందిన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశా రు.దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి తదితర అంశాలను పరిశీలించనున్నారు.విచారణ అనంతరం ఆయా వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అర్హులందరికీ కొత్తగా ఆహార భద్రతా కార్డులు జారీ చేయటంతోపాటు రేషన్‌ కోటా విడుదలకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది.  పట్టణంలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే ఆహర భద్రతా కార్డులకు అర్హులుగా పేర్కొన్నారు. 

 ఫోర్‌ వీలర్‌ ఉన్న వారిని అనర్హులుగా పేర్కొన్నారు.@మన్యం మనుగడ

Share it:

TELANGANA

Post A Comment: