CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పని చేయని వారి పట్ల కఠిన చర్యలు, నిర్ణయాలు

Share it:

 


👉రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన్యం టీవీ, కొత్తగూడెం:

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, అటవీ శాఖ, పంచాయతీ రాజ్, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్స్, ఇతర అధికారులతో గతంలో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి, మళ్ళీ నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతిపై క్షేత్ర స్థాయిలో రివ్యూ సమావేశం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడుతూ..

పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని, 20వ తేదీ నుండి జిల్లాల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు.

నేటి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు కథనరంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ‘‘మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంట నెనున్నానని(మంత్రి) ధైర్యంతో పనిచేయండి’’ అని అధికారులకు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

 ‘‘మంచిగ పనిచేసిన వాళ్లను గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేస్తామని అదే విధంగా పని చేయని వారి పట్ల కఠిన చర్యలు, నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు.

గత పట్టణ, పల్లె ప్రగతిలో చేపట్టిన పనులలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నామని, అతి తక్కువ శాతంలో కొన్ని డంపింగ్ యార్డులు, వైకుంఠధామం లు ప్రారంభం కాలేదని, వాటికి తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు పునుకొని వాటిని ప్రారంభించి వాడుకలోకి తేవాలన్నారు.

గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత బాధ్యతను, గ్రామ సర్పంచి తీసుకోవాలని, మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసంబంధ సంస్థల పారిశుధ్య బాధ్యతను మున్సిపాలిటి పాలకవర్గాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలన్నారు. 

సమీక్షా సమావేశం సందర్భంగా  మండల వారిగా అంశాలవారిగా ప్రగతి పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయితీ రాజ్ కార్యదర్శి, అన్ని గ్రామాల్లో అంశాలవారిగా పురోగతిని తెలుసుకున్నారు.

వైకుంఠధామాల నిర్మాణాలు, ప్రకృతి వనాల నిర్మాణం, డంపు యార్డుల నిర్మాణం సహా ఇతర అంశాల నిర్మాణాలను పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్లు కొన్నారా? కిస్తీలు చెల్లిస్తున్నరా? కరెంటు బిల్లులు కడుతున్నారా? పారిశుధ్యం, చెత్తసేకరణ, పచ్చదనం, మంచినీటి సరఫరా, మొక్కల స్థితి ఏ జిల్లాలలో ఎలా ఉన్నది అన్న అడిగి తెలుసుకున్నారు. మొక్కలు బతికిన శాతం, గ్రామ సభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీవోలు పాల్గొంటున్నతీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను మంత్రి పువ్వాడ అడిగి తెలుసుకున్నారు. 

చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య నిర్వహణ, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం వంటి అంశాలను పేరు పేరు నా వివరాలు తెలుసుకున్నారు. 

ఈ అంశాల్లో పురోగతిని అనుకున్న రీతిలో సాధించకుండా, వెనకబడిన మండలాల్లో తక్షణమే నూటికి నూరు శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

ప్రభుత్వం చేపట్టిన ‘‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నయని, అయితే ప్రతి సీజన్ లో సీజన్ ప్రారంభానికి ముందే  వైద్యశాఖతో అటు పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలిసి కూర్చోని వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విధానాన్ని ఒక పని సంస్కృతిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజల వైద్యం, ఆరోగ్య విషయంలో  అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ గ్రామానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారు చేయాలని సూచించారు. 

పట్టణాల్లో మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ త్రాగునీరు పట్టణాలకు బల్క్ సప్లై పూర్తి స్థాయిలో అందుతున్నదని ఐతే, అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారు. 

గిరిజనుల పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల పట్ల అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం చేస్తున్నారని ఇది సారిఅయిన చర్యకాదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యకు మానుకొని ప్రభుత్వంకు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలని హితువు పలికారు.

మండల పీహెచ్ స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. వ్యాధుల ముందస్తు చర్యలకోసం ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ‘‘వ్యాధులు ప్రబలినంక మందుల డబ్బాలు చేతుల పట్టుకోని తిరిగి పరేశాన్ కాకుండ సీజన్ ప్రారంభం కన్నాముందే ఏ ఏ వ్యాధులు వ్యాపించే ప్రమాదమున్నదో చర్చించి వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వైద్యశాఖ, పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: