CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సొసైటీ సేవలను రైతులు వినియోగించు కోవాలి

Share it:

 


   --- డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు.


మన్యం టీవీ పాల్వంచ:- మండలంలోని రైతులు సొసైటీ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని *డి.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. మంగళవారం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఎం.ఆ.ర్పీ ధరలకు విక్రయించే వరి విత్తనాలు, ఎరువులు పంపిణీ కార్యక్రమాన్ని *కొత్వాల* ప్రారంభించారు.ఈ సందర్బంగా *కొత్వాల* మాట్లాడుతూ నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వారికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అందించడమే సొసైటీ పాలక వర్గం   లక్ష్యం అని అన్నారు. సొసైటీ ద్వారా BPT 5204 వరి విత్తనాలు 25 కిలోల బస్తా 807.50 రూపాయలకు మొత్తం 400 బస్తాలు,ముత్ 10 10 వరి విత్తనాలు 25 కిలోల బస్తా 802.50 రూపాయలకు మొత్తం 120 బస్తాలు పంపిణీ చేపట్టిమన్నారు. ఎరువులు డి.ఎ.పి  50 కిలోల బస్తా 1200 రూపాయిలకు మొత్తం 400 బస్తాలు, యూరియా 45 కిలోల బస్తా 266.50 రూపాయలకు మొత్తం 3115 బస్తాలు పంపిణీ చేయనున్నామ  న్నారు.రైతులకు అన్ని రకాల  సేవలు చేసేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగా చేసుకోవాలని *కొత్వాల కోరారు.

    ఈ కార్యక్రమంలో *సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, జడ్పీటీసీ సభ్యులు బరపటి వాసుదేవరావు, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామమోహన్ రావు, కనగాల నారాయణరావు  , చౌగాని పాపారావు, యర్రంశెట్టి మధుసూదనరావు, మైనేని వెంకటేశ్వరరావు(బాబు), బర్ల వెంకటరమణ, సామా జనార్దన్ రెడ్డి, MPTC మద్దుల వీర మోహన్ రావు, సొసైటీ గోడౌన్   ఇంఛార్జ్ కాలు సాని సురేందర్ రెడ్డి*   తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: