మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: వ్యవసాయంలో ముఖ్యంగా వరి సాగులో నాటు కూలీల కొరత మరియు కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోవటం వలన రైతుల పై పెట్టుబడి వ్యయం అధికమవుతున్న తరుణంలో, మండలంలోని రాజపురం గ్రామ రైతులు,మరికొన్ని గ్రామాల రైతులు. వరి నాట్లు పద్ధతిని మార్చి, కరివేత పద్ధతిలో వరి విత్తనాలు చల్లారు.గత సంవత్సరం వేసిన వరి నాటు పద్దతి పంట కు , కరివేత పద్ధతిలో చల్లిన వరి పంటకు దిగుబడులు సమానంగా రావటం అందుకు ముఖ్య కారణం. మండల వ్యవసాయ అధికారి-అనూష. రాజాపురం గ్రామంలో కరివేత పద్ధతిలో వరి విత్తనాలు చల్లిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడుతూ వరిలో గడ్డి కలుపు పుట్టకుండా మందులు స్ప్రే చేయాలని, వరి మెక్కలు వడ బడకుండా నీటి సదుపాయం ఉన్నా పొలాలకు నీళ్లు పెట్టుకోవాలని, ఒత్తుగా ఉన్న వరి మొక్కలను పీకి, వేరే ప్రదేశంలో నాటాలని అప్పుడే వరి మొక్కలు మంచిగా దుబ్బు చేస్తాయని, సూచనలు చేశారు.ఈ పరిశీలనా కార్యక్రమంలో ఆమె వెంట ఏఈఓ-సంధ్యారాణి, రైతులు-లీలకుమార్ రెడ్డి, ఏసుబాబు, తదితర రైతులు ఉన్నారు.
Post A Comment: