మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మంగళవారం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ జూలూరుపాడు, ఏన్కూరు, మండలాలకు చెందిన 23 మంది, లబ్ధిదారులకు 5,16,500 రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్, పేద, బడుగు, బలహీన, వర్గాల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగమే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు నేను మీకు అందజేస్తున్న చెక్కుల ని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి లావుడ్యా సోని, జెడ్ పి టి సి భూక్యా కళావతి, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నర్సింహరావు, ఎంపీటీసీలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరు మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు ఎదళ్ళపల్లి వీరభద్రం, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: