• అమరవీరులకు ఘనంగా నివాళులు
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయం లో తహశీల్దార్ ఎం ఉష శారద, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బానోతు పార్వతి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బి రాజేష్ కుమార్, సిడిపిఓ కార్యాలయం లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల, గానుగపాడు సహకార సంఘం సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, టిఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యా నాయక్, టిడిపి పార్టీ దిమ్మె వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు వారధి సత్యనారాయణ, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ జి అన్నపూర్ణ,వైస్ ఎంపీపీ సత్యం, లింగయ్య,రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: