మన్యం మనుగడ,భుర్గంపాడ్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా...ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఈరోజు కోయగూడెం,తాళ్లగొమ్మురు,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం,బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీలలోని పల్లె ప్రకృతి వనాలను,వైకుంఠ ధామాలను,డంపింగ్ షెడ్డులను,నర్సరీలను సందర్చించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,ఎంపీడీఓ వివేక్ రామ్,మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,APO శ్రీలక్ష్మి.
అనంతరం జడ్పీటీసీ శ్రీలత గారు మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలలో,వైకుంఠ ధామాలలో,డంపింగ్ షెడ్డులలో,నర్సరీలలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో వీధి వీధి తిరుగుతూ డ్రైనేజీలలోని పేరుకుపోయిన పూడిక మట్టిని తీయించి శుభ్రం చేయించాలని,బ్లీచింగ్ చల్లించి,హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని ఆయా గ్రామ సర్పంచ్ లను,సెక్రటరీలను కోరారు.అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ అమర్చి మొక్కలను సంరక్షించాలని కోరారు.ప్రతి గ్రామ పంచాయతీలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయటంతో పాటు అత్యంత సుందరంగా తీర్చిదిద్ది బూర్గంపహాడ్ మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు తుపాకుల రామలక్ష్మి,కొయ్యల పుల్లారావు,భూక్య శ్రావణి,స్థానిక ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీరాణి,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు బెల్లకొండ రామారావు,తుపాకుల రవి మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: