CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోత్తికోయ గూడెంలో వైద్య శిబిరం

Share it:

 


( అన్నపురెడ్డిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం )

అన్నపురెడ్డిపల్లి,మన్యం మనుగడ::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట(పెద్దిరెడ్డిగూడెం) గ్రామ పంచాయతీ,శాంతి నగర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో నివసిస్తున్న 20 కుటుంబాల(61 మంది గిరిజనులు) గోత్తికోయ గిరిజన గూడెంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని-ప్రియాంక ఆధ్వర్యంలో రాపిడ్ యాంటిజెన్ టెస్ట్,రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ లు నిర్వహించారు. అందులో ఒక్కరికీ కూడా పాజిటివ్గా నిర్థారణ కాలేదు. అనంతరం గిరిజన కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి వచ్చిన 35 దోమతెరలను పంపిణీ చేశారు. గిరిజనులతో వైద్య అధికారిని-ప్రియాంక మాట్లాడుతూ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని, వర్షాకాలం  ప్రారంభం అవుతున్నందున డయేరియా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి, జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ-వెంకటేశ్వరరావు , హెచ్ఈఓ-పోలెబోయిన కృష్ణయ్య, హెల్త్ విజిటర్-శారారాణి, హెల్త్ అసిస్టెంట్-శ్రీదేవి, ఆశాలు- విజయలక్ష్మి, సీత , వెంకటలక్ష్మి, నజీమా ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: