మన్యం మనుగడ, భద్రాచలం టౌన్: భద్రాచలంలో ఇటీవల కరోనా తో ఇరువురు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించింది .ఆదివారం భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం విశ్రాంత కార్యనిర్వహణాధికారి వేగేశ్న రామకృష్ణంరాజు చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి రూ 20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగ పనిచేస్తూ మృతి చెందిన కట్ట వెంకన్న ,సెలూన్ షాప్ లో పని చేస్తూ మృతి చెందిన కె నాగేశ్వర్ రావ్ కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాస రాజు మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో కరోనా మృతి చెందిన కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ రూ 15 లక్షల వరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారి పిల్లలు ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరిస్తే వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు వసుధ సంస్థ చైర్మన్ మంతెన వెంకట రామరాజు సిద్ధంగా ఉన్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు సుబ్బరాజు పివీ సత్యనారాయణ పాల్గొన్నారు.
Post A Comment: