CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం

Share it:


     రూ 20000వేల ఆస్తినష్టం.                          

     బోరున విలపిస్తున్న బాధితులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం  మండల కేంద్రంలోని మానస పల్లి గ్రామానికి చెందిన కాళ్ళ సామ్రాజ్యం కి చెందిన గడ్డివాము ప్రమాదవశాత్తు గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. నిరుపేద ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన సామ్రాజ్యం కి గత కొన్ని రోజుల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గేదెల రుణంగా పొంది గేదెల పాలు అమ్ముకుంటూ వారి కుటుంబం జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు20 వేల రూపాయల విలువచేసే గడ్డి కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసి ఖాళీ స్థలంలో నిలువ చేయగా ప్రమాదవశాత్తు కాలిపోయిందని వారు బోరున విలపించారు. గడ్డివాము దగ్ధం అవుతున్న సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి  సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే 90 శాతం గడ్డివాము కాలిపోయింది.వివరాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు.దళిత నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: