CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు లతో కలిసి చెక్ డ్యామ్ లను సందర్శించిన రేగా.

Share it:

 


తొలకరి జల్లులతో చెక్ డ్యామ్ లో నీరు నిలవడంతో ఆయకట్టు రైతు ముఖంలో అనందం

సీఎం కేసీఆర్ కి  నియోజకవర్గ రైతుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మన్యం టీవీ కరకగూడెం :నియోజకవర్గ రైతులు రెండు పంటలు పండించి వారి ముఖంలో కనిపించే అనందం చూడటమే ప్రభుత్వ ఉద్దేశం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని పెద్దవాగు,రాళ్లవాగు,పై నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి కావడంతో వాటిని ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి మోతె పెద్దవాగు పై నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత 2009 సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గలో గోదావరి, పెద్ద వాగు, కిన్నెరసాని వాగులపై  కోట్ల నిధులతో అనేక లిప్టుఇరిగేషన్ స్కీములు మంజూరు చేసుకుంటే అవి అనివార్య కారణాలతో పూర్తి కాలెకపోయాయని అలాగె అనివార్య కారణాల వల్లన 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా పోటిచేయక పోవడంతో అవి అంతటితో ఆగిపొయినాయి వాటిని పట్టించు కునే నాదుడే లేడు అని గుర్తు చేశారు. నేను రెండవ సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మరల సీఎం కేసీఆర్ గారి సహకారంతో మరల నియోజకవర్గం వ్యాప్తంగా 17 చెక్ డ్యామ్ లను ఇరిగేషన్ స్కీమ్ ల ద్వారా మంజూరు చేయించి వాటిని సకాలంలో పూర్తి చేయించి ఆయకట్టు రైతులకు అంకితం చెయ్యటం జరిగిందన్నారు. పెద్దవాగు నీళ్ళు ఉరకలు వేస్తున్న చెక్ డ్యామ్ లలో నీరు చేరడంతో ఆ సంతోషాన్ని రైతులతో కలిసి ఒక రైతు బిడ్డగా రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా వారితో లిసి వారి సంతోషాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చెక్ డ్యామ్ ల ద్వారా   2000 ఎకరాలకు రెండు పంటలను పండించె విధంగా సాగునీరు అందుతుందని రేగా అన్నారు.అలాగే తొలకరి చినుకుతో  చెక్ డ్యామ్ లలో నీరు నిండు కుండల ఉండటంతో రైతు కళ్లలో అనందం కనపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎఈ సక్రునాయక్,వర్క్ ఇన్స్పెక్టర్ సంగరయ్య బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు తాటి గూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం  పోలెబోయిన వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలిపెద్ది శ్రీనువాస రెడ్డి రేగా సత్యనారాయణ రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: