CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మూఢనమ్మకాల నెపంతో వ్యక్తి హత్య..

Share it:

 




 మాన్యం టివి దుమ్ముగూడెం: మండలంలోని కొత్త మారేడుబాకా గ్రామంలో తేది.12.05 .2021 న అర్ధరాత్రి సమయంలొ కనిపించకుండా పోయిన  కొత్త మారేడు బాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య  గురించి అతని కొడుకు తిరుపతి రావు  పిర్యాదు పై తేదీ. 15.05.2021 న దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ case నమోదు చేయడం జరిగింది ఇట్టి భీమయ్య గురించి విచరిస్తుండగా, ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో కొత్త మరెడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ,తెల్లం రాజారావు @ రాజ్ కుమార్, మిడియం శ్రీను అను నలుగురు వ్యక్తులు  పోలీస్ స్టేషన్ కు వచ్చి కుంజా భీమయ్య గ్రామాల్లో అందరి కి మంత్రాలు , చేతబడులు చేస్తుంటాడు. ఈ క్రమంలో తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు 2 నెలల క్రితం డెంగ్యూ జ్వరం తో చనిపోయాడని,రాజకుమార్ తల్లి కి చాలా రోజులనుండి కాళ్ళు, చేతులు వాపులు వస్తున్నాయని,మీడియం శ్రీను వల్ల నాన్న ఏడాది క్రితం అనారోగ్యం తో చనిపోయినాడని వీళ్ళందరినీ ఎన్ని ఆసుపత్రి లకు తిప్పిన నయం కాలేదని  వీటన్నింటికీ భీమయ్య మంత్రాలు చేతబడులు మాత్రమే కారణం అనే మూఢ నమ్మకమనే  అనుమానం తో భీమయ్య మీద కోపం పెంచుకొని ఎలాగైనా భీమయ్య ను చంపాలని ఉద్దేశం తో పధకం ప్రకారం తేదీ. 12.05.2021 నా అర్ధరాత్రి వీళ్ళు నలుగురు భీమయ్య ను గుడ్డ తాడు సాయంతో భీమయ్య మెడకు ఉరి వేసి చంపేసి మోసుకుంటూ నర్సాపురం గ్రామం శివారులో గల గోదావరి నది లోకి తీసుకెళ్ళి ఇసుకలో గొయ్యి త్రవ్వి పుడ్చేసామని చెప్పగా వెంటనే సి .ఐ వెంకటేశ్వర్లు గారు వీరిని  అదుపులోకి తీసుకొని శవాన్ని పుడ్చిన స్థలం దగ్గరకు వెళ్లి MRO గారి సమక్షంలో శవాన్ని బయటకు తీసి  బాగా కుళ్లిన స్థితిలో గుర్తు పట్ట లేనంతగా ఉండటంతో వెంటనే శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించి శవాన్ని మృతిని కుటుంభ సభ్యలకు అప్పగించి ముద్దాయిలకు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు కు పంపడం జరిగింది. ఇదేవిధంగా ఎవరైనా ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మి ఇలాంటి పనులకు పాల్పడి  తమ జీవితాలను పాడు చేసుకోవద్దు అని చట్టపరంగా కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  సి. ఐ వెంకటేశ్వర్లు గారు తెలియజేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: