గుండాల జూన్ 25 (మన్యం టీవీ) పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గుండాల తండాకు చెందిన ధరమ్ సోత్ రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవి ఇంటి వద్ద పురుగుల మందు తాగడంతో గమనించిన బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్న సమయంలోనే రవి మృతిచెందాడని డాక్టర్ రవి చంద్ పేర్కొన్నారు. రవి మండల కేంద్రంలో బొలెరో వాహన డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు
Post A Comment: