కరోనా సమయంలో ప్రజలకు ముందుండి సేవలందిస్తున్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్
సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
గుండాల ఆళ్ల పల్లి (మన్యం టీవీ)ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆళ్ల పల్లి మండలంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు కరోనా ఈ సమయంలో ప్రజలకు సేవలందించడంలో ముందు ఉన్నారన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలకు 20 వేల రూపాయల కుర్చీలు 3 సీలింగ్ ఫ్యాన్ లను ఫౌండేషన్ సభ్యులు అందజేశారు అన్నారు. రవి దేవి శెట్టి వారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనితోపాటు వారి సహకారంతోనే ఎనభై వేల రూపాయల నిత్యవసర వస్తువులను గుత్తి కోయిల కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు. దీనితోపాటు 40 వేల రూపాయల మల్టీ పెరామీటర్ నో త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అడిగిన వెంటనే స్పందించి మారుమూల మండలమైన ఆళ్ల పల్లి కి సహాయ సహకారాలు అందించిన ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. అనంతరం షబ్బీర్ భాష కొద్ది రోజుల క్రితం కరోనాతో మండలంలో కొందరు వివిధ పార్టీల నాయకులు మృతి చెందారు వారి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , సర్పంచ్ కోటేశ్వరరావు ,కోఆప్షన్ సభ్యులు రహీం ,సిపిఐ మండల కార్యదర్శి కృష్ణయ్య ,సహాయ కార్యదర్శి నరెడ్ల రాంబాబు ,మద్దెల వెంకటేశ్వర్లు ,ప్రశాంత్ ,శివ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: