CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట లో కోటి విలువచేసే గంజాయి పట్టివేత

Share it:

 



 చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు


 మన్యంటీవీ, అశ్వారావుపేట:అశ్వారావుపేట పోలీసులు కోటి విలువచేసే గంజాయిని పట్టుకున్నారు. ఎస్ఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో తన సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద జీలుగుమిల్లి వైపు నుండి వస్తున్న మామిడి కాయల వ్యానులో తరలిస్తున్న గంజాయి ని కనిపెట్టి పట్టుకున్నారు. పాల్వంచ డిఎస్పి కె.ఆర్.కె ప్రసాదరావు,  అశ్వారావుపేట సీఐ బంధం ఉపేంద్ర రావు మీడియా ముఖంగా విలేకర్లతో మాట్లాడుతూ  కోవిడ్ -19 విధుల్లో భాగంగా ఎస్ఐ రామ్మూర్తి తన సిబ్బందితో బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా  ఏపీ 31 టి హెచ్ 6813 నెంబరు గల   బొలెరో వాహనం జీలుగుమిల్లి వైపు నుండి వస్తుండగా దానిలోని వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటం వలన దానిని ఆపి చెక్ చేయగా దానిలో మామిడికాయల బస్తాలు ఉండి వాటి క్రింద నల్లటి పట్టా కప్పి ఉండగా అనుమానం వచ్చి బొలెరో వాహనం లో ఉన్న డ్రైవర్ తో సహా ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని నల్లటి పట్టాలు తీసి తనిఖీ చేయగా ప్రభుత్వం వారు నిషేధించిన గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని, వెంటనే అశ్వారావుపేట తహసిల్దార్ సమక్షంలో ఇద్దరు పంచులను పిలిపించి పైన తెలిపిన ముగ్గురు వ్యక్తులను విచారించగా తన పేర్లు మహమ్మద్ రాహుల్ ఉత్తర ప్రదేశ్, మహమ్మద్ సల్మాన్ ఉత్తర ప్రదేశ్, కంప రామిరెడ్డి విజయనగరం జిల్లా  అని చెప్పినారని పోలీసులు మీడియాకు వివరించారు. మొదటి ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల క్రితం విశాఖపట్నం చింతపల్లి లోతుగడ్డ గ్రామానికి చెందిన పంగి శివ మరియు పంగి నారాయణ రావు వద్ద సుమారు ఆరున్నర క్వింటాళ్ల గంజాయి కొనుక్కొని వాటిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక ధరలకు అమ్ముటకు రామిరెడ్డి యొక్క బొలెరో వాహనంలో గంజాయి ప్యాకెట్లు లోడ్ చేసి వాటిపైన మామిడికాయ బస్తాలు వేసుకొని ఈరోజు ఉదయం లోతుగడ్డ లో బయలుదేరి జంగారెడ్డిగూడెం నుండి అశ్వారావుపేట వైపుగా వస్తుండగా వాహన తనిఖీలు పట్టుబడ్డారని,అలాంటి గంజాయి ప్యాకెట్లు లెక్కించి తూకం వేయగా 130 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని, వాటి మొత్తం బరువు ఆరు వందల ఎనభై ఆరు కేజీలని,మొత్తం విలువ ఒక కోటి రెండు లక్షల 97 వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని, 130 గంజాయి ప్యాకెట్లను మరియు బొలెరో వాహనాన్ని స్వాధీనపరచుకొని పైన తెలిపిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు మీడియాకు వివరించారు. అశ్వారావుపేట బోర్డర్లో 24 గంటలు నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయని నిషేధిత వస్తువులు అయినా గంజాయి మరియు ఇతర వస్తువులు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు ఊకే రామ్మూర్తి, చల్లా అరుణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: