👉పెట్రోల్ బంక్ ముందు నిరసన తెలిపిన సిపిఎం సిపిఐ ఎం ఎల్ ఎ న్డి వామపక్ష పార్టీలు
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బా రాలు మోపే విధానాన్ని నిరసిస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా ఈ రోజున స్థానిక ఉదయ భాస్కర్ థియేటర్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ ముందు సిపిఎం సిపిఐ NDనాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సునీల్ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వామపక్ష పార్టీ నాయకులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంబి నర్సారెడ్డి NDపార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చెలరంగారెడ్డి సిపిఐ పార్టీ ఏ సునీల్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న ది. ఒక వైపు ప్రజలు కరోనా కష్టకాలంలో పనులు లేక వ్యాపారాలు లేక సతమతమౌతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రోజురోజుకు రేట్లు పెంచుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయల పైగా దాటని గ్యాస్ ₹1000 దగ్గరికి వచ్చిందని నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి, మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఏజెంట్ గా మారిందని, అధాని అంబానీ లాంటికార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ వారి ఉత్పత్తులు అయినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను మరియు వంట నూనెలను నిత్యవసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచుకునే దానికి మోడీ అండగా ఉంటూ వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఒక వైపు రైతులు 200 రోజులకు పైగా నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే ,వారిని ఖాతరు చేయకుండా వారి డిమాండ్లను పట్టించుకోకుండా పెట్టుబడిదారులకు తొత్తు గా మారిందని అన్నారు .కావున ఈ నెల 26వ తేదీన రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు జయప్రదం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి సంతోష్ Nనాగరాజు N లీలావతి Dలక్ష్మి ప్రవీణ్ Kరవి పాల్గొన్నారుcpi ఖాదర్ ఎమ్మార్పీఎస్ నాయకులు అలవాల రాజా వారి సభ్యులు సంఘీభావం తెలియజేసినారు ఎంబి నర్సారెడ్డి
Post A Comment: