మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పర్యటనలో భాగంగా మండలంలోని ఒంపు గూడెం, మాణిక్యారం, లక్ష్మీనారాయణ తండ, నాయకులగూడెం, గ్రామాలలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ విస్తృతంగా పర్యటించారు. కరోనా బారిన పడిన వారి గడపగడపకు వెళ్లి వారిని పరామర్శించి బాధితులకు కూరగాయలు, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వారితో మాట్లాడుతూ ఎవరు ఆ ధైర్యం పడొద్దని అండగా నేనున్నానని వారిలో మనోధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: