మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలం వడ్ఢేరంగాపురం గ్రామం లో కాంగ్రెస్ నాయకులు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు ఉస్మాన్ బాబా మరియు మండల నాయకులు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి ఇవ్వడం తో సంబరాలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసు బాణసంచా పేల్చారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరారు, వల్లెపు లక్ష్మయ్య, దేరంగుల వెంకట్రావు, సూర్యనారాయణ, పల్లపు శ్రీనివాసరావు తో సహా గ్రామం లో దాదాపు ముప్పై కుటుంబాలు కాంగ్రెస్ తీర్ధం పుచుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో ఓబీసీ జిల్లా అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఎంపీటీసీ వేముల భారతి, వేముల ప్రతాప్, కో ఆప్షన్ సభ్యులు పాషా, సత్యవరపు బాలయ్య, ముల్లగిరి కృష్ణ, బండారు మహేష్ మరియు కాంగ్రస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: