CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా హెల్ప్ లైన్ సెంటర్ గా సిపిఎం పార్టీ కార్యాలయం.

Share it:



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:


చండ్రుగొండ మండలం లోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరోనా హెల్ప్ లైన్ సెంటర్ ను కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య హెల్ప్ లైన్ సెంటర్ గా మార్చి కమ్యూనిస్టులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ మరోసారి నిరూపించుకున్నారు. అందులో భాగంగానే బుధవారం చండ్రుగొండ సిపిఐ(ఎం) పార్టీ కార్యాలయాన్ని హెల్ప్ లైన్ సెంటర్ గా మార్చి మండల వైద్యాధికారి ని డాక్టర్ ఎస్ గీత చేతులమీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ. కరోనా పేషెంట్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభించడం చాలా అభినందనీయమన్నారు. డాక్టర్ గారు అన్నారు రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కాసాని ఐలయ్య మాట్లాడుతూ. కరోనా మహమ్మారి తో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి ప్రజాసంఘాలు వారికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మండల ప్రజానీకానికి కరోనా మహమ్మారి నుండి రక్షించాలని కరోనాకు పేషెంట్లకు కుటుంబాలకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన హెల్ప్ లైన్ కి తెలియజేయాలి అలా హెల్ప్ లైన్ దృష్టికి వచ్చిన ప్రతి కుటుంబానికి సహాయసహకారాలు అందించాలని సూచించారు. అలాగే కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ వైద్యుల సహాయ సహకారాలతో కరోనా పేషెంట్ లకు జాగ్రత్తలు సూచిస్తూ సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరేష్, జంగిల్ వెంకటరత్నం, రైతు సంఘం జిల్లా నాయకులు రామ్ రెడ్డి, సిఐటియు మండల నాయకులు రామడుగు వెంకటాచారి, కెవిపిఎస్ మండల నాయకులు రాయి రాజా, ఎలమందల లక్ష్మణ్, దాసరి సీతారాములు, మహిళా సంఘం నాయకురాలు జైమున్నిసా బేగం, తదితరులు పాల్గొన్నారు. హెల్ప్ లైన్ కమిటీ సభ్యులు ఫోన్ నెంబర్లు 6302669534, 6281198075, 7702747416, 6281009366, 8639295777, 7337506389, 8106459342, సెంటర్ కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లు ప్రజలు ఉపయోగించు కోవాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: