CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే వనమా చేతుల మీదుగా అంబేద్కర్ మహిళ సంఘ నాయకురాళ్లకు అరుదైన పురష్కారం...

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం, జూన్ 28:-

సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాత పాల్వంచ గల ఎమ్మెల్యే వనమా స్వగృహం నందు అంబేద్కర్ మహిళ సంఘ నాయకురాళ్లు మాట్ల గాయత్రి, కెడెం కృపావేణి, నక్కా సృజన లకు ఉత్తమ సేవకు గాను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అంతర్జాతీయ భారతీయ దళిత సాహిత్యం అకాడమీ ఢిల్లీ వారు అందించే అరుదైన అంబేద్కర్ ఫెల్లో షిప్ అవార్డ్ మరియు సావిత్రి బాయి పూలే అవార్డ్ నీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అందించడం జరిగింది...

ఈ సందర్భంగా మహిళ సంఘ నాయకురాళ్లు మాట్లాడుతూ మాకు ఈ అవార్డ్ నీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేసారు...

మాకు ఈ అవార్డ్ రావడం వల్ల సమాజంలో ఇంకా ఎంతో భాద్యత పెరిగింది అని ఇంకా మేము చేయగలిగినన్ని సేవ కార్యక్రమాలు తప్పక చేస్తామని చెప్పడం జరిగింది.

మాకు ఎల్లవేళలా అండగా ఉంటున్న స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా కటేశ్వరరావు కి మరియు వారి తనయుడు టీఆరెస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు కి అలాగే భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ ప్రదేశ్ ప్రసిడెంట్ జితేంద్ర మను కి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది...

Share it:

Post A Comment: